నటి మీనాకు అసూయ కలిగిందట!

  • ఆమెకు ఇష్టమైన నందిని పాత్రలో ఐశ్వర్యారాయ్
  • తన జీవితంలో మొదటిసారి అసూయ పడుతున్నట్టు మీనా పోస్ట్
  • పొన్నియిన్ సెల్వన్ చిత్ర యూనిట్ కు అభినందనలు
నటి మీనా తన జీవితంలో చోటు చేసుకున్న అత్యంత విషాద ఘటన నుంచి కోలుకుంటున్నారు. భర్త విద్యా సాగర్ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ, పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది జూన్ 28న చెన్నైలో మరణించడం తెలిసిందే. సన్నిహితుల చొరవతో ఈ విషాదం నుంచి నటి మీనా క్రమంగా బయటకు వస్తున్నారు. మళ్లీ నటించేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. 

ఈ క్రమంలో నటి మీనా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా (మీనాసాగర్16)లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాను ఎంతో మెచ్చుకున్నారు. ఈ సినిమాలో నటించిన వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు. అదే సమయంలో ఈ సినిమాలో నందిని పాత్రను (ఆమెకు ఎంతో ఇష్టమైన) పోషించిన ఐశ్వర్యారాయ్ ను చూసి తనకు ఈర్ష్య కలుగుతున్నట్టు మీనా పోస్ట్ పెట్టారు. 

‘‘దీన్ని ఎంతో కాలం దాచుకోలేను. నాకు ఊపిరి సలపనీయడం లేదు. దీన్ని బయటకు తీయాల్సిందే. నాకు అసూయగా ఉంది. నా జీవితంలో మొదటిసారి ఐశ్వర్యారాయ్ ను చూసి అసూయ పడుతున్నాను. ఎందుకంటే ఆమె నా డ్రీమ్ రోల్ అయిన నందిని పాత్రను పీఎస్-1లో (పొన్నియిన్ సెల్వన్) పోషించింది. విజయాన్ని అందుకుంటున్న చిత్ర యూనిట్ కు అభినందనలు’’అని మీనా పోస్ట్ లో పేర్కొంది.

actor Meena
feeling jealous
Aishwarya Rai Bachchan
ps 1
ponniyin selavann

More Telugu News